Published On: Fri, May 18th, 2018

వ‌చ్చే ఏడాది జాతీయ‌స్థాయిలో మొద‌టి స్థానం మ‌న ల‌క్ష్యం కావాలి

* విజ‌య‌వాడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ నివాస్ ఆకాంక్ష‌

* స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో తొలి ర్యాంకు ద‌క్క‌డంప‌ట్ల కార్పొరేష‌న్‌లో వేడుక‌లు

* కేకును క‌త్తిరించి ఆనందాన్ని పంచుకున్న అధికారులు, సిబ్బంది 

* మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ నివాస్‌ను అభినందించిన మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018 ర్యాంకుల్లో భాగంగా దేశంలో పది లక్షలకు పైబడి జనాభా గల పరిశుభ్ర నగరాల్లో విజయవాడ తొలి స్థానంలో నిలిచి ఘ‌న చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న విష‌యం విధిత‌మె. ఈ నేప‌ధ్యంలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో గురువారం సంబ‌రాలు జ‌రుపుకున్నారు. మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ అధ్య‌క్ష‌త‌న కౌన్సిల్ హాల్‌లో నిర్వ‌హించిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో అధికారులు, కార్పొరేట‌ర్లు, ఉద్యోగ సంఘాల నేత‌లు పాల్గొని క‌మిష‌న‌ర్ నివాస్‌తో పాటు మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌ల‌ను శాలువాతో ఘ‌నంగా స‌త్క‌రించి అభినందించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ జె.నివాస్‌లు మాట్లాడుతూ ప‌రిశుభ్ర న‌గ‌రాల్లో తొలి స్థానం విజ‌య‌వాడ‌కు రావ‌డంలో విశేష కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులు, అధికార యంత్రాంగాన్ని అభినందించారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో తొలి ర్యాంకు సాధించ‌డంలో నిత్యం క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న చేస్తూ అధికారులు, సిబ్బందిని స‌మ‌న్వ‌య‌ప‌రుస్తూ విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పాటుప‌డుతున్న క‌మిష‌న‌ర్ నివాస్‌ను మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ గోగుల వెంక‌టర‌మ‌ణ‌రావుల‌తో పాటు కార్పొరేట‌ర్లంద‌రూ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించారు. ఈ సంద‌ర్భంగా క‌మిస‌న‌ర్ నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ  మొద‌టి ర్యాంకును సాధించ‌డంతో పాటు జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచింద‌న్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రంలో జాతీయ‌స్థాయిలో మొద‌టి స్థానంలో నిలిపేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌మష్టి కృషి చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా కేకును క‌త్తిరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా పరిశుభ్ర న‌గ‌రంగా విజ‌య‌వాడ‌కు తొలి ర్యాంకు రావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మినిస్టిరియ‌ల్ అసోసియేష‌న్ స‌భ్యులు క‌మిష‌న‌ర్ జె.నివాస్‌, మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌ల‌ను శాలువాతో స‌త్క‌రించి అభినందించారు. కార్య‌క్ర‌మంలో మేనేజ‌ర్ ఎ.నాగ‌కుమారి, మినిస్ట్రిరియ‌ల్ అసోసియేషన్ కార్య‌ద‌ర్శి జి.అజ‌య్‌కుమార్‌, కోశాధికారి వి.ప్ర‌భావ‌తి, సంయుక్త కార్య‌ద‌ర్శి క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఉపాధ్య‌క్షురాలు విజ‌య‌ల‌క్ష్మీ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...