Published On: Wed, Oct 31st, 2018

వ‌రుణ‌యాగంలో పాల్గొన్న మంత్రి సోమిరెడ్డి

సెల్ఐటి న్యూస్‌, గూడూరు: గూడూరు నియోజకవర్గం కోట మండలం వంజివాకలో శ్రీ కామాక్షిదేవి సమేత జలసిద్దేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణయాగంలో భాగంగా బుధ‌వారం ఉద‌యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, రైతులందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని జలసిద్ధేశ్వర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. కార్య‌క్ర‌మంలో సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహనరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...