Published On: Mon, May 18th, 2020

వ‌ల‌స కార్మికుల ప‌ట్ల మాన‌వ‌త్వం చూపండి..

* అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీల ప‌ట్ల వారికి అందుతున్న సహాయక చర్యలపై సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఉదయం సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడిన సీఎం ఇప్పటివరకూ అందించిన సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు. వ‌ల‌స కార్మికుల ప‌ట్ల ఉదార‌త చూపాల‌ని ఆదేశించారు. కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లలో చేర్చి అన్ని సదుపాయాలు అందించామన్న అధికారులు వీరిని తిరిగి బస్సుల్లో పంపించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లానుంచి 10 బస్సుల్లో 470 మంది, కృష్ణాజిల్లా నుంచి 16 బస్సుల్లో 410 మంది, శ్రీకాకుళం నుంచి 1 బస్సులో 22 మందిని పంపించామన్న అధికారులు. ఇవాళ గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లానుంచి 52 మంది వలసకూలీలను పంపిస్తున్నామన్న అధికారులు. నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదని వారికి చెప్తూనే భోజనం, ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్న విషయాన్ని కూలీలకు వివరిస్తున్నామని చెప్పిన అధికారులు ఏ రాష్ట్రంలోకూడా మన ప్రభుత్వంలా చేయడంలేదన్న అధికారులు. భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో వారికి లోటు రానివద్దన్న సీఎం.
ఖర్చులు గురించి ఆలోచించవద్దని ఉదారంగా, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని సీఎం స్పష్టం చేశారు. మానవత్వాన్ని చూపించాల్సిన సమయమన్న సీఎం సూచించారు‌, సీఎం ఆదేశాలతో నడుచుకుంటూ వెళ్తున్న వారిని అధికారులు షెల్టర్లకు తరలిస్తున్నారు. భోజనంతో పాటు వారికి ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

Just In...