Published On: Mon, Sep 4th, 2017

వ‌స‌తిగృహంలో విద్యార్థిని ఆత్మహత్య..

* ఆగ్రహించిన స‌హ విద్యార్థులు

* హాస్టల్ ఫర్నిచర్ ద్వంసం

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు డెస్క్‌: గుంటూరు విద్యానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెస్సార్ మ్యాట్రిక్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా వనపర్రుకి చెందిన ఎన్.జయశ్రీ సోమ‌వారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుంది. తోటి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి హాస్టల్ నిర్వాహకులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న బందువులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మరణించిన తమ కుమార్తెని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విల‌పించారు. ఆగ్రహించిన బంధువులు హాస్టల్‌లోని ఫర్నిచర్‌ని ద్వంసం చేశారు. కుర్చీలు, బల్లలు విరగగొట్టారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. పోలీసులు విషయం తెలుసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా తమకు న్యాయం చేయాలని జయశ్రీ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ హాస్టల్ వద్ద బందువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

crime_04-09-17_1

Just In...