Published On: Sat, Jan 18th, 2020

శక్తివంతమైన సమాచార ఉపగ్రహంగా జీశాట్‌-30

* ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూషణ్ హ‌రిచంద‌న్‌

ఏపి రాజ్‌భ‌వ‌న్, సెల్ఐటి న్యూస్ (విజయవాడ): జీశాట్‌ 30 ఉపగ్రహా ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్ సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ భారీ ఉపగ్రహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపింది. జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగా, దీని ద్వారా భారత కమ్యూనికేషన్స్ అవసరాలు బల పడతాయని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ఉపగ్రహం ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయన్న బిశ్వ‌భూషణ్ ఈ ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశ పెట్టటం ముదావహం అని, భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహంగా జీశాట్‌-30 పని చేస్తుందని ఇశ్రో ప్రకటిచటం శుభ పరిణామమని రాష్ట్ర గవర్నర్ కొనియాడారు.

Just In...