Published On: Fri, Nov 29th, 2019

శబరిమల యాత్రలో విషాదం..

* రోడ్డు ప్ర‌మాదంలో విజయనగరం జిల్లా వాసి దుర్మ‌ర‌ణం

* 15 మందికి గాయాలు

సెల్ఐటి న్యూస్‌, విజయనగరం: తమిళనాడులోని కంచిలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వర రావు(25)గా గుర్తించారు. మిగిలిన వారు కూడా అదే గ్రామానికి చెందినవారిగా భావిస్తున్నారు.

Just In...