Published On: Wed, Dec 5th, 2018

శబరిమల యాత్రికులు అప్రమత్తంగా ఉండాలి..

* పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ సూచన

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: కేరళలోని శబరిమల సందర్శించే రాష్ట్రానికి చెందిన భక్తులు హెచ్-1 ఎన్-1 వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య శాఖ సూచించింది. కోట్లాది మంది శబరిమల సందర్శిస్తారని, ఈ క్ర‌మంలో వైరస్ సోకే

Sabarimala

ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భక్తులు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారు తగ్గేవరకు శబరిమల వెళ్లకపోవడం మంచిదని ప్రజారోగ్యశాఖ అధికారులు సూచించారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారికి స్వైన్ ఫ్లూ వైరస్ త్వరగా సోకడంతో పాటు, ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. శబరిమల ప్రయాణంలో భక్తులకు హెచ్-1 ఎన్-1 వైరస్ సోకితే వెంటనే కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స తీసుకోవాలని సూచించారు.

Just In...