Published On: Thu, Nov 28th, 2019

శాఖాపరమైన సేవల్లోనూ రాణించాలి…

* వి.వి.ప్ర‌సాద్ ఆత్మీయ అభినంద‌న స‌భ‌లో ఆర్జేడీ స్వర్ణలత

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఏపి ఎన్జీవో నేతగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు శాఖాపరమైన సేవల్లోనూ మరింతగా రాణించి వి.వి.ప్రసాద్ ఉన్నతస్థాయికి ఎదగాలని సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎల్.స్వర్ణలత ఆకాంక్షించారు. ఎపి ఎన్జీఓస్ అసోసియేషన్ విజయవాడ నగర శాఖకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సమాచార శాఖ పబ్లిసిటీ అసిస్టెంట్ వి.వి.ప్రసాద్‌కు బుధవారం సూర్యారావుపేటలో కోవెలమూడి వారి వీధిలో ఉన్న ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో ఆత్మీయ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ స్వర్ణలత మాట్లాడుతూ వి.వి.ప్రసాద్ శాఖాపరంగా తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించి అధికారుల మన్ననలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి ఎపి ఎన్జిఓస్ అసోసియేషన్ మూడు పర్యాయాలు కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలోను అసోసియేషన్ పరంగా సామాజిసేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉద్యోగులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రసాద్ సమాచార శాఖలో ఒక ఉద్యోగిగానే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆత్మీయ బంధువుగా వ్యవహరిస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నార‌ని ప్ర‌శంసించారు. ఉద్యోగుల సమస్యలతో పాటు శాఖాపరమైన సేవల్లోనూ ఇదే పంథాను కొనసాగించి భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయిని చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఆత్మీయతతో తనను అభినందించడం సంఘాన్ని అభినందించడంగా భావిస్తున్నానన్నారు. ఉద్యోగులందరూ ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు. తాను ఉద్యోగరీత్యా బాధ్యతలను నిర్వర్తించడంలో అధికారులు సిబ్బంది అందిస్తున్న సహకారం మరువలేనివన్నారు. ఎపి ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తనవంతు బాధ్యతను నిర్వహిస్తానని భవిష్యత్తులో ఇదే సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు జె.కె.కృష్ణశ్రీ, కార్యాలయ సిబ్బంది యం.శ్రీనివాసరావు, యం.ఎల్.ఆచార్యులు, కె.ఏసుదాసు, ఎస్.యు.ఫరూక్, యు.వి.సుబ్బారావు, కె.శాంతరాజు, ఎన్.చినవెంకటేశ్వరావు, ఎల్.భానుమతి, వై.వి.కృష్ణారావు, జి.రాంబాబు, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Just In...