Published On: Sun, Feb 21st, 2021

శారదా పీఠాన్ని సందర్శించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్..

విశాఖ‌ప‌ట్నం, సెల్ఐటి న్యూస్: విశాఖ శ్రీ శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శారదా పీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు పొందారు. ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవ కార్యక్రమాల వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శారద పీఠాధిపతి వివరించారు. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు కూడా గౌతమ్ సవాంగ్ తీసుకున్నారు.

Just In...