Published On: Wed, Feb 6th, 2019

శాసనమండలి చైర్మన్ పదవికి షరీఫ్ నామినేషన్ దాఖలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఏపీ శాసనమండలి చైర్మన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ ఎం.ఎ.షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం మంత్రులు యనమల రామకృష్ణడు, నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కె.ఎస్.జవహర్‌తో పాటు శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్‌తో కలిసి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు షరీఫ్ అందజేశారు. సాయంత్రం వరకూ ఒక్క నామినేషన్ పత్రమే దాఖలైందని, గురువారం ఉదయం 11.30 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటిస్తామని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు.

Just In...