Published On: Mon, May 18th, 2020

శ్రామిక్ రైలును ప్రారంభించిన డీజీపీ గౌత‌మ్‌ స‌వాంగ్‌

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వెస్టేషన్ నుండి అరుణాచల్‌‌ప్రదేశ్ వెళ్తున్న శ్రామిక రైలును ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్, కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.ఎండి.ఇంతియాజ్ ఆదివారం రాత్రి సిగ్నల్ లైటును చూపిస్తూ ప్రారంభించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో లాక్‌డౌన్ అమ‌లు కార‌ణంగా ఆంద్రప్రదేశ్‌లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజల‌ను అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్టాలకు చెందిన వారిని శ్రామిక రైలు ద్వారా తరలించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...