Published On: Fri, Nov 2nd, 2018

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

* ఫిబ్రవరి నెలకు 67,146 ఆర్జిత సేవా టిక్కెట్లు

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్ర‌వారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వామివారి సేవలో పాల్గొనేందుకు వీలుగా వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్‌ విధానంలో ఆన్‌లైన్‌లో జారీ చేసింది. విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే బుక్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 67,146 టిక్కెట్లను తితిదే విడుదల చేసింది. ఇందులో కరెంట్‌ బుకింగ్‌ కింద 57,350 ఆర్జిత సేవాటిక్కెట్ల అధికారులు విడుదల చేశారు. సుప్రభాతం 7,096, తోమాల 110, అర్చన 110 , అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300, విశేష పూజ 2,000, కల్యాణోత్సవం 12,825, ఊంజల్‌ సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, వసంతోత్సవం 14,850, సహస్ర దీపాలంకరణ 16,200 టిక్కెట్లను భక్తులు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

Just In...