Published On: Thu, Sep 17th, 2020

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రావాల‌ని ముఖ్య‌మంత్రికి ఆహ్వానం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల‌ని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధికారి(ఈవో) అనిల్‌కుమార్‌ సింఘాల్, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను కలిసి ఆహ్వాన ప‌త్రిక అందించారు. అదేవిధంగా ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేశారు.

 

Just In...