Published On: Sun, May 19th, 2019

శ్రీవారి సేవలో కర్ణాటక సీఎం

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, మంత్రి రేవన్న శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు  శ్రీవారిని దర్శించుకున్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని, కర్ణాటకలో కాంగ్రెస్‌ కూటమి 18సీట్లు గెలుస్తుందని ఈసందర్భంగా కుమారస్వామి తెలిపారు. వీఐపీ ప్రారంభ దర్శనసమయంలో ఏపీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Just In...