Published On: Tue, Sep 25th, 2018

శ్రీవారి సేవ‌లో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారిని భార‌త ఉపరాష్ట్రపతి ముప్ప‌వ‌ర‌పు వెంకయ్య నాయుడు మంగ‌ళ‌వారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఆల‌య అధికారులు, వేదపండితులు ఆయ‌న‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ద‌ర్శ‌నం అనంత‌రం వేదాశీర్వ‌చ‌నం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ స్వామి దర్శన భాగ్యం మనకే కాదు, అందరికీ దక్కేలా చేయడంలో ఆనందం ఉంటుంద‌న్నారు. అందుకే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు వీలైనంతగా రాకను తగ్గించుకోవడం ద్వారా స్వామి దర్శనం సామాన్యులకు మరింత సులభతరం అవుతుంద‌న్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుని దర్శనభాగ్యం లభించింది. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉండే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని ప్రార్ధించిన‌ట్లు తెలిపారు.

Just In...