Published On: Mon, Jun 10th, 2019

శ్రీవారి సేవ‌లో ప‌లువురు ప్ర‌ముఖులు

సెల్ఐటిన్యూస్‌, తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మండ్యా ఎంపీ సుమలత శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులు.. స్వామివారికి నిర్వహించిన సర్కారీ సహస్ర కలశాభిషేకం సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతరించిపోతున్న ఎర్రచందనాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.

 

Just In...