Published On: Fri, Feb 26th, 2021

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

* సీఎంను కలిసి ఆహ్వ‌న ప‌త్రిక‌ను అందించిన మంత్రి వెల్లంపల్లి, శ్రీశైలం ఈవో

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలం శివరాత్రి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మార్చి 11న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివరాత్రి
బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆహ్వానించారు. శుక్ర‌వారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వారు సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. పవిత్ర వస్త్రాలను కూడా సీఎం జగన్‌కు బహూకరించారు. కార్య‌క్ర‌మంలో శ్రీశైలం ఆలయ వేదపండితులు పాల్గొన్నారు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి.

Just In...