Published On: Fri, Aug 14th, 2020

శ్రీ కోదండ రామాలయంలో ఉట్లోత్సవ ఆస్థానం

తిరుపతి, సెల్ఐటి న్యూస్‌: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ  సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీకృష్ణస్వామివారిని ముఖ మండపంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు ఉభయాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.

Just In...