Published On: Fri, Apr 26th, 2019

సంతోషమ్ ఎక్స్‌క్లూజీవ్ మ్యాచింగ్స్, ఫ్యాబ్రిక్స్ షోరూమ్ ప్రారంభం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ మ్యూజియం రోడ్డు, హోటల్ మినర్వా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంతోషమ్ మ్యాచింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ షోరూమ్ శుక్రవారం తమ్మన రామతారకం, తమ్మన బాలమ్మ ప్రారంభించారు. అనంతరం తమ్మన రామతారకం మాట్లాడుతూ బీసెంట్ రోడ్డు సంతోషమ్ క్లాత్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గత 3ఏళ్లుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ నేడు ఎక్స్ క్లూజీవ్ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్ షోరూం ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ముంబ‌యి, సూరత్, అహ్మాదాబాద్, బెనారస్, జైపూర్ ఫ్యాబ్రిక్స్, 2×2 అరవింద, మధుర, ఉమైద్యిల్ పాం ప్లెయిన్, ఇక్కత్ కాటన్ ఇంకా మరెన్నో ప్రముఖ మిల్లుల ఫ్యాబ్రిక్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వేలాది వెరైటీలతో ఎవ్వరూ ఇవ్వలేని భారీ తగ్గింపు ధరలకే అందిస్తున్నట్లు, వివ‌రించారు. స్వయంగా విచ్చేస్తే తేడానీ కొన‌గోలుదారులే గ‌మ‌నించ‌వ‌చ్చ‌న్నారు. గత మూడు సంవత్సరాలుగా కోస్తా జిల్లాలో ఎవ్వరూ ఇవ్వని విధంగా కేవలం తమ షోరూమ్ ఫ్యాక్టరీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రారంభోత్సవంలో తమ్మన నాగేంద్రకుమార్, కొత్త సాయి, వస్త్ర వ్యాపారులు, నగర ప్రముఖులు, ఏజంట్లు తదితరులు పాల్గొన్నారు.

Just In...