Published On: Wed, Feb 24th, 2021

సందేశాత్మ‌క చిత్రాల్లో న‌టించాల‌ని ఉంది

* నాంది చిత్రం స‌క్సెస్‌మీట్‌లో ‌సినీ న‌టుడు అల్ల‌రి న‌రేష్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: భ‌విష్య‌త్తులో సందేశాత్మ‌క చిత్రాల్లో న‌టించాల‌ని ఉంద‌ని ప్ర‌ముఖ సినీ న‌టుడు అల్ల‌రి న‌రేష్ చెప్పారు. నాంది చిత్రం విజ‌య‌వంతం కావ‌డంతో చిత్ర బృందం బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా నాంది చిత్ర క‌థానాయ‌కుడు అల్లరి న‌రేష్ మాట్లాడుతూ అల్ల‌రి చిత్రంతో త‌న‌కు కమెడియన్ హీరోగా గుర్తింపు వచ్చింద‌న్నారు. నరేష్ కామెడినే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తాడనే నమ్మకం ప్రేక్ష‌కుల్లో వచ్చింద‌ని తెలిపారు. నాంది చిత్రంలో కంటెంట్ ఉన్న కారణంగానే హిట్ అయ్యింద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రంలో పాత్ర కోసమే న్యూడ్‌గా నటించడానికి ఇబ్బంది పడలేద‌న్నారు. ఇక‌పై కథ‌ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాన‌ని తెలిపారు. సందేశం ఉన్న చిత్రాల్లోనటించాలని ఉంద‌ని వెల్ల‌డించారు. నాంది చిత్ర ద‌ర్శ‌కుడు‌కనకమేడల విజయ్మాట్లాడుతూ.. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరించారన్నారు. నాంది చిత్రంతోనరేష్‌కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింద‌న్నారు. నిర్మాత సతీష్వేగేశ్న మాట్లాడుతూ నాంది చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందనలభిస్తోంద‌ని, క్లాస్, మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నార‌నితెలిపారు. ఈ చిత్రం విజయం స్ఫూర్తిగా తీసుకుని మ‌రిన్ని మంచి చిత్రాలునిర్మిస్తాం అన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ నాంది చిత్రాన్నితెలుగు ప్రేక్షకులు ఆదరించార‌ని తెలిపారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలుచెప్పేందుకే సక్సెస్ యాత్ర చేపట్టామ‌న్నారు. త‌న కోసం ప్రత్యేకంగాపాత్రలు రాయడం సంతోషంగా ఉంద‌ని తెలిపారు.అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలుచేయాలనేది త‌న కోరిక అన్నారు. నాంది చిత్రం విజ‌య‌వంతం కావ‌డంతో అల్ల‌రిన‌రేష్ స‌హా చిత్ర బృందం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాతక‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. చిత్ర ‌బృందంతో సెల్ఫీలుదిగేందుకు అభిమానులు పోటీప‌డ్డారు.

Just In...