Published On: Sat, May 18th, 2019

సంపూర్ణ మెజార్టీతో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మరోసారి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాబోతున్నారని, సంపూర్ణ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నారా లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్ర‌వారం సాయంత్రం జహపన వ‌స్త్ర షోరూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు.

Just In...