Published On: Tue, Jan 8th, 2019

సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌లో శిల్పారామాల‌ది కీల‌క భూమిక‌

* శిల్పారామం క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన ముఖేష్‌కుమార్ మీనా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శిల్పారామాల అభివృద్దికి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్ర‌దాయాల ప‌రిర‌క్ష‌ణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ శిల్పారామం, ఆర్ట్స్‌, క్రాప్ట్స్‌, క‌ల్చ‌ర‌ల్ సొసైటీ క్రియాశీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. రూ.20 కోట్ల వ్య‌యంతో శిల్పారామాల అభివృద్ది ప‌నులు వివిధ ద‌శ‌ల‌లో ఉన్నాయ‌న్నారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ శిల్పారామం, ఆర్ట్స్‌, క్రాప్ట్స్‌, క‌ల్చ‌ర‌ల్ సొసైటీ రూపొందించిన క్యాలెండ‌ర్‌ను మీనా ఆవిష్క‌రించారు. సొసైటీ సిఇఓ జ‌య‌రాజ్‌తో పాటు ప‌ర్యాట‌క శాఖ పిఎంయు విభాగ ప్ర‌త్యేక అధికారి ల‌క్ష్మ‌ణమూర్తి, శిల్పారామం ఉన్న‌తాధికారులు గురుప్ర‌సాద్‌, భ‌క్త‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్పారామాల‌ను స్వ‌యం పోష‌కాలుగా తీర్చిదిద్దేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఈ సంద‌ర్భంగా  మీనా అధికారుల‌ను అదేశించారు. న‌వ్యాంధ్ర‌లో శిల్పారామాల‌ను పూర్తి స్ధాయిలో అభివృద్ది చేసి జ‌న‌రంజ‌కంగా తీర్చి దిద్దేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని, అయితే స్ధానిక ప‌రిస్ధితుల‌ను అనుస‌రించి, అక్క‌డి వాస్త‌వ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు.

Just In...