Published On: Mon, Aug 19th, 2019

సమగ్ర చేనేత విదానం అమలు చేయాలి

* ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్

* రాజమహేంద్రవరం నగర శాఖ ఏర్పాటు

* రూ.2 వేల కోట్లతో చేనేత కార్పోరేషన్ కు డిమాండ్

సెల్ఐటి న్యూస్, రాజమహేంద్రవరం: సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతనివ్వాలని ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేసారు. ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాజమహేంద్రవరం నగరశాఖ ప్రమాణ స్వీకార మహోత్సవం గౌతమీఘాట్ వద్దున్న బొమ్మన రామచంద్రావు చాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణమండపంలో ఫ్రంట్ కేంద్ర మండలి సభ్యులు కాలెపు సత్యనారాయణ మూర్తి అద్యక్షతన ఘనంగా జరిగాయి. సంధర్భంగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యధర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్  మాట్లాడుతు చేనేత రంగం సంక్షోభంలో ఉందన్నారు. చేనేత జాతి సమస్య కాదని ఇదొక జాతీయ సమస్యని దేశ సాంస్కృతి సంపదైన చేనేత పరిరక్షణ అందరి బాద్యతని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా 5 లక్షలు,  పరోక్షంగా 10 లక్షల మంది చేనేత రంగంపై ఆదారపడి బ్రతుకుతున్నారని, నేతకార్మికులు నేసే  వస్త్రాలకు సరైన గిట్టుబాటు దరలేక అల్పాదాయ వర్గంగా  సమాజంలో  మిగిలిపోయారని అన్నారు. చేనేతరంగం అభివృద్ధి చెందాలన్నా, నేతన్నల తలసరి ఆదాయం పెరగాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీకృత చేనేత విదానాన్ని అమలు చేయ్యాలని అన్నారు. చేనేత, జౌళశాఖ కలిసి ఉండడం వలన చేనేతరంగానికి అన్యాయం జరుగుతుందని, చేనేతను జౌళశాఖ నుంచి విడగొట్టి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చేనేత రంగాన్ని ప్రక్షాళణ చేసి నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తారనె నమ్మకం ఉందని విశ్వనాథ్  అన్నారు. కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికుల పక్షపాతని నవరత్నాల అమలుతో చేనేత కార్మికులకు పెట్టబడి సహాయం అందుతుందన్నారు. రాజమహేంద్రవరం నగర, రూరల్  శాశనసభ్యులు ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ చౌదరి మాట్లాడుతు చేనత సమస్యలపై ప్రత్యేకంగా అసంబ్లీలో ప్రస్తావిస్థానని అన్నారు.  సంధర్భంగా 2000 కోట్లతో వీవర్స్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు, చేనేతను జౌళశాఖ నుంచి విడదీసి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు,  చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు,  కార్మికులకు గుర్తింపు కార్డులిచ్చి ఆరోగ్య బీమా కల్పన,  జీఓకి పరిమితమైన ఉచిత విద్యుత్ సౌకర్యం పథకం అమలు,  వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న కార్మికులకు  నాలుగు నెలలు ‘నేత భృతి’ అమలు,  వయస్సు పైబడి పనిచేయలేని నేత  కార్మికులకు తలసేమియా, డయాల్సిస్ పేషంట్ల వలే  రూ.10 వేలు పెంక్షన్ మంజూరు,  ఆత్మహత్యలు చేసుకున్న నేత  కార్మిక కుటుంబాలకు    రైతుకిచ్చే పరిహారం వలే  రూ.7 లక్షలు నష్టపరిహారం, చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విదించిన  జీయస్టీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఇలా సదస్సు తీర్మానాలు చేసారు. ఆంధ్రప్రదేశ్, వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సారథ్యంలో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి చేనేత సమస్యలపై సమగ్ర  నివేదిక సమర్పించనున్నామని తెలిపారు. నగర శాశనసభ్యులు ఆదిరెడ్డి భవాని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వీవర్స్ ఫ్రంట్ నగరశాఖ అద్యక్ష, ప్రదాన కార్యధర్శులుగా యిమంది మోహనరావు, పుచ్చల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేనేత సమాజానికి విశేష సేవలందించిన కాలెపు సత్యనారాయణమూర్తిని, డా. శీరం శ్రీరామ చంద్రమూర్తి ని చేనేతభందు బిరుదుతో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు బొమ్మన రాజ్ కుమార్, మాజీ శాశనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, శాశనమండలి సభ్యులు కందుల దుర్గేష్,  బాబూరావు, ఫ్రంట్ ఉపాద్యక్షులు శీరం లక్ష్మణ ప్రసాథ్, రాజాపంతుల నాగేశ్వరరావు, పుచ్చల రామకృష్ణ, బైరెత్తి శివన్నారయణ, కాంబ్లే గణేష్, పొలిట్  బ్యూరో సభ్యులు యం.ఆర్ శ్రీనివాస్, రాపర్తి జైవీర్, తెలంగాణ చేనేత ఉద్యమకారులు దాసు సురేష్, అదిక సంఖ్యలో చేనేత కులస్తులు పాల్గొన్నారు.

Just In...