Published On: Tue, May 14th, 2019

సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఐ.రాజా

* గజిట్ నోటిఫికేషన్ విడుదల

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఐలాపురం రాజాను నియామకంపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ(జీపీఎం & ఎఆర్) గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కోయా ప్రవీణ్‌కుమార్ మంగ‌ళ‌వారం ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఐలాపురం రాజాను ఏపీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నియమించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవీ కాలం ఐదేళ్లు. ఒకవేళ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వారి వయస్సు 65 ఏళ్లు నిండినా పదవీ కాలం ముగుస్తుందని ఆ గజిట్ నోటిఫికేషన్‌లో ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

Just In...