Published On: Fri, Mar 12th, 2021

సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: కృష్ణా జిల్లా పెనమలూరులో మహాశివరాత్రి వేళ రెండు కుటుంబాలలో విషాదఛాయలు అల‌ముకున్నాయి. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు బాలలు గల్లంతు కావ‌డంతో ఆ కుటుంబాల వారు తీవ్ర ఆందోళ‌న చెందారు. పెనమలూరు మండలం పెదపులిపాక దగ్గర కృష్ణా నదిలో ఈతకు వెళ్లి సమీర్ (13),అబ్దుల్ రెహ్మాన్ (16) గల్లంత‌య్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలించ‌గా సాయంత్రానికి సమీర్, రెహ్మాన్ మృతదేహాలు లభ్యం అయ్యాచి. దీంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాధ‌చాయ‌లు అల‌ముకున్నాయి. కుటుంబ‌స‌భ్యులు కన్నీరుమున్నీరుగా విల‌పించ‌డం స్థానికుల‌ను కంట‌త‌డి పెట్టించింది.

Just In...