Published On: Fri, Nov 27th, 2020

సర్ధార్ మరుపిళ్ల చిట్టికి మంత్రి వెలంప‌ల్లి నివాళి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాస‌న‌స‌భ్యులు సర్ధార్ మరుపిళ్ల చిట్టికి రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. మరుపిళ్ల చిట్టి 123వ జయంతి కార్య‌క్ర‌మాన్ని బ్రాహ్మ‌ణ‌వీధిలోని దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించారు. తొలుత మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మరుపిళ్ల చిట్టి  చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ స‌ర్ధార్ మరుపిళ్ల చిట్టి ఆశ‌య సాధ‌న కృషి చేయ‌డ‌మే వారికి అర్పించే నిజ‌మైన నివాళి అన్నారు. కార్య‌క్ర‌మంలో వైఎస్‌ఆర్‌సిపి కార్పొరేటర్ అభ్యర్దులు మరుపిళ్ల రాజేష్, బంకా విజయ, పార్టీ నాయ‌కులు రాయన నరేంద్ర, గురుమాంతు మహేష్, మజ్జి శ్రీనివాస్, బంక శ్రీను, శీలం వెంకటేశ్వరరావు, పణుకు ఫణి తదితరులు పాల్గొన్నారు. 

Just In...