Published On: Sun, Apr 22nd, 2018

సాధికార మిత్ర‌లతో ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌ధ‌కాల స‌మాచారం

* వీసీలో ముఖ్య‌మంత్రికి వివ‌రించిన జేసీ-2 బాబూరావు  

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా ఇంటింటికి సాధికార మిత్రల ద్వారా స‌మాచారాన్ని కరపత్రంగా ముద్రించి అందిస్తున్నామని విజ‌య‌వాడ జేసి-2 పి.బాబూరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉండవల్లిలోని తమ‌ నివాసం నుండి శ‌నివారం నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ (వీసీ)లో జేసి-2 బాబూరావు సాధికార మిత్రలతో కలిసి కలెక్టరు విడిది కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ‌లుప‌రుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల‌ను ప్రతి కుటుంబానికి చేరేవిధంగా కృషి చేస్తున్నామ‌ని, ప్ర‌త్యేకంగా ముద్రించిన కరపత్రాలను ప్రతి కుటుంబానికి చేరేలా సాధికార మిత్రలు పనిచేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వివ‌రించారు.

ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరులో రాష్ట్రంలో కృష్ణా మొదటి స్థానం: కలెక్టర్ ల‌క్ష్మీకాంతం

ఉద్యోగుల ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్సీలో జిల్లాలోని 6805 కార్యాలయాలకుగాను 6383 కార్యాలయాల్లో సిబ్బంది ఈ విధానంలో హాజరు వేసి 93 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వుందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 13 నుండి 19 వరకు ఈ ఆఫీసు నిర్వహణలో 7868 ఫైళ్లు చేయాల్సి వుండగా 7472 ఫైళ్లు పరిష్కరించి 95 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 6149 పనులకు అనుమతులు మంజూరు చేసి 4889 పనులు పూర్తి చేయడం ద్వారా 79.51 శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంద‌ని చెప్పారు. జిల్లాలో మీ సేవా కేంద్రాల్లో ఏప్రిల్ 21నాటికి 82,82,565 ధరఖాస్తులు రాగా వాటిలో 41,08,519 ధరఖాస్తులు పరిష్కరించామ‌ని, 6,28,871 ధరఖాస్తుల‌ను తిరస్కరించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్ల‌డించారు.

Just In...