Published On: Sat, Nov 9th, 2019

సాధ‌న‌తోనే క‌ళాత్మ‌క చిత్రాలు సాధ్యం…

* అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం అభినందనీయం

* ఫొటోగ్రాఫ‌ర్ సాయి అభినంద‌న స‌భ‌లో అట్లూరి రాజశేఖర్

సెల్ఐటి న్యూస్‌, హనుమాన్‌జంక్ష‌న్‌: గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్ ధనియాల గణపతి మణికంఠ నాగసాయికుమార్ అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం అభినందనీయమని ఎపియుడబ్ల్యూజే ప్రింట్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్ అన్నారు. బాపులపాడు మండలం హనుమాన్‌జంక్షన్‌లో శనివారం సాయికి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా అట్లూరి మాట్లాడుతూ ఇటీవల త్రిపుర రాష్ట్రం అగర్తలలో కోల్‌క‌తాకు చెందిన పిక్టరీయల్ సంస్థ సౌజన్యంతో (ది లెన్సషన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్-2019) జరిగిన అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో సాయి గోల్డెమెడల్ సాధించడం సంతోషకరమన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ వైల్డ్ లైఫ్, లాన్కేప్, పోర్ట్రైట్, మోనోక్రోమ్, వెడ్డింగ్ విభాగాల్లో జరగగా సాయికి లాంస్కెప్ విభాగంలో మెడల్ వచ్చినట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ పోటీలో ఫోటోలను జడ్జ్‌మెంట్ చేసిన తరువాత ఎగ్జిబిషన్‌లో ఉంచిన వాటిని అక్కడ ప్రజలు ఉన్న‌త‌మైన వాటిని ఎంపిక చేసినట్టు చెప్పారు. నేటి సమాజంలో ఫోటోలు ఎవరైనా తీస్తారని కానీ కళాత్మకంగా చిత్రాలను రూపొందించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం అంద‌రికీ సాధ్యం కాద‌న్నారు. నేటి యువత సాయిని ఆదర్శంగా తీసుకుని ఫోటోగ్రఫీలో రాణించాలని సూచించారు. ప్రతి ఫోటోగ్రాఫర్ సమాజానికి, దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రామకృష్ణ, ది గోల్ జాయ్ డి.సి.స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధనియాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Just In...