Published On: Tue, Jul 28th, 2020

సినీ న‌టుడు రావి కొండలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైందని జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

Just In...