Published On: Thu, Jul 18th, 2019

సిరిచంద‌న సాయి శిరీష అద్భుత ప్ర‌తిభ‌..

* శాస్త్రీయ, సినీ శాస్త్రీయ, జానపద నృత్యం విభాగాల్లో రంజింప‌జేసిన అభిన‌యం

* అఖిల భారత శాస్త్రీయ మరియు జానపద నృత్య పోటీల్లో ప్ర‌ధ‌మ బ‌హుమ‌తి  

* అభినందించిన పీబీ సిద్ధార్థ క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజ‌య‌వాడ‌): పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్  సైన్స్ కళాశాల ప్రథమ సంవత్సరం బీసీఏ విద్యార్థిని సిరిచందన సాయి శిరీష విశాఖపట్నంలో ఈ నెల 13, 14,15 తేదీల్లో నాట్య రవళీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహించిన 29వ అఖిల భారత శాస్త్రీయ మరియు జానపద నృత్య పోటీలలో పాల్గొని శాస్త్రీయ నృత్యం, సినీ శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం విభాగాలలో ప్రథమ బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. నాట్యాచార్యులు సప్పా శివకుమార్ వద్ద నాట్యాభ్యాసం చేసిన శిరీష జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలలోని అన్ని విభాగాలలో ప్రతిభ కనపరిచి ప్రథమ బహుమతి సాధించడం ద్వారా నాట్య అభినయ పురస్కారం పొందినట్లు పేర్కొన్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచి 150 మందికి పైగా పాల్గొన్న పోటీదారులలో అన్ని విభాగాలలో విజేతగా నిలిచిన శిరీషను ఈ సంద‌ర్భంగా సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ వేమూరి బాబురావు, సాంస్కృతిక విభాగ అధ్యాపకులు జయప్రకాష్, శివరంజని, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Just In...