Published On: Thu, Aug 6th, 2020

సివిల్స్ ర్యాంకర్లకు ముఖ్య‌మంత్రి జగన్‌ శుభాకాంక్షలు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌ ‌రెడ్డి
శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా  ఉందంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ‘సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘన విజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ  శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Just In...