Published On: Thu, Feb 7th, 2019

సి.బి.సి.ఎన్.సి ఎడ్యుకేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా గొటుకుల సుందరరాజు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: సి.బి.సి.ఎన్.సి ఎడ్యుకేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా గొటుకుల సుందరరాజునే పున‌ర్నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారిచేసింది. ఈ సందర్భంగా గురువారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుందరరాజు మాట్లాడుతూ తనకు గత సంవత్సరం మే 5న ప్రభుత్వం సి.బి.సి.ఎన్.సి ఎడ్యుకేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా పదోన్నతిని కల్పించారన్నారు. కానీ.. కొంతమంది స్వార్ధపరులు గతేడాది జూలై 2న వేరే వాళ్ళను నియమించినట్టు ఆధారాలు చూపెట్టి తన నియామకాన్ని మరుగునపడేశారి తెలిపారు. ఈ విషయమై తన పదోన్నతపై కోర్టులో సవాలు చేశానని ప్రభుత్వం ఆరు నెలల పాటు సమగ్ర విచారణ జరిపి తదుపరి బుధవారం నాడు తననే సి.బి.సి.ఎన్.సి ఎడ్యుకేషన్ రాష్ట్ర కన్వీనర్‌గా ఉత్తర్వులు జారీచేశారన్నారు. తనను మళ్ళి నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు సి.బి.సి.ఎన్.సికి సంబంధించిన అన్ని స్కూల్స్, కాలేజీలు ఇంకా విద్యాసంస్థలను అభివృద్ధి చేయుటకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ఇచ్చిన పదోన్నతిని త్రికరణశుద్ధితో ఎటువంటి అవంతరాలు లేకుండా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో రెవరెండ్ డివి రత్నం, రెవరెండ్ ఎస్.ఎలీషారావు, రెవరెండ్ ఎన్.యేసుదయ, రెవరెండ్ యన్ జార్జిముల్లర్, తదితరులు పాల్గొన్నారు.

Just In...