Published On: Wed, Dec 2nd, 2020

సీఎం అస‌మ‌ర్థ‌త‌తో రైతులు న‌ష్ట‌పోతున్నారు

* తొలిసారి స‌భ నుంచి స‌స్పెండ్ అయ్యా

* తెదేపా అధినేత చంద్ర‌బాబు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో రైతులు నష్టపోతుంటే ఆ విషయంపై చర్చించకుండా అధికార వైకాపా సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పంటల బీమా కట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెందిన పంటల బీమాను ఎందుకు క్లెయిమ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా నేతలు అసెంబ్లీలో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమ‌వారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. శాసనసభకు ఆలస్యంగా వచ్చే ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నానని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. తెదేపా సభ్యుడు రామానాయుడు సభలో మాట్లాడినప్పుడు పై కంపార్ట్‌మెంట్‌లో ఏమీలేదు… అంటూ ఆయన్ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సీఎంకు ఇంగిత జ్ఞానం ఉందా? మాట్లాడే తీరు ఇదేనా? అని మండిపడ్డారు. సభలో వైకాపా సభ్యులు నీచంగా మాట్లాడారని ఆరోపించారు. జగన్.. ఫేక్ ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. పంట నీటిలోనే కుళ్లిపోవడంతో పాటు కొన్నిచోట్ల దాన్యం మొలకలు వచ్చాయి. ఇలాంటి అంశంపై చర్చ చేపట్టి ఎంత పరిహారం ఇస్తారనేది చెప్పాల్సింది పోయి మాపైనే ఎదురుదాడి చేస్తారా? సీఎం జగన్ చేతగానితనం, అసమర్థత, అహం వల్ల రారు. రైతాంగం న‌ష్ట‌పోతోంది. వారి ఉసురు తగులుతుంది. ఈ ఏడాదిన్నరలో ఏడుసార్లు పరదలు వచ్చాయి. ఈ ఏడాది రూ.1300 కోట్లు కట్టి ఉంటే కనీసం రూ3. రూ.4వేల కోట్లు ఇన్సూరెన్స్ రైతులను వచ్చేది. ఉన్న వ్య‌వ‌స్థ‌ను కుప్ప‌కూల్చి కొత్త వ్యవస్థ తెస్తామంటూ ఉత్తి మాటలు చెబుతున్నారు అంటూ చంద్ర‌బాబు మండిపడ్డారు. త‌న జీవితంలో తొలిసారి స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెళ్లాన‌ని తెలిపారు.

Just In...