Published On: Mon, Apr 16th, 2018

సీఎం చంద్ర‌బాబుకు ర‌ఘువీరారెడ్డి లేఖ‌ సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప‌లు డిమాండ్ల‌కు సంబంధించి వెంట‌నే నెర‌వేర్చాల‌ని కోరుతూ ఎపిసిసి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం న్యాయమైన డిమాండ్ల‌ను తీర్చాల‌ని, 21వేల మంది ప్రజారోగ్య వైద్య ఉద్యోగులకు న్యాయం చేయాల‌ని, జి.ఓ.నెం.27 రద్దు చేయాల‌ని, జిఓ నెం 27ను సవరించి, ‘కన్సాలిడేటెడ్ పే’ అనే విధానం రద్దు చేయాల‌ని, ఒకే పనికి ఒకే వేతనం సుప్రీం కోర్టు తీర్పును అమ‌లు చేయాల‌ని, పారా మెడికల్ ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని, ప్రజారోగ్య పనులు కుంటుపడే విధంగా వారిని ఇతర పనులకు, తమరి ప్రచార కార్యక్రమాలకు వినియోగించటం దారుణం. తక్షణం నిలిపివేయాల‌ని, హైకోర్టు తీర్పుననుసరించి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు విధానాన్ని తొలగించి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాల‌ని ర‌ఘువీరా ఆ లేఖ‌లో ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవ‌ల జ‌రిగిన 84వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగుల, కార్మికుల దోపిడీని రద్దు చేస్తామని తీర్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకుళ్లారు. ప్రాధమిక వైద్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు సరిపడే స్థాయిలో మందుల సరఫరా చేయాల‌ని, ఎంతో సమంజసమైన వారి డిమాండ్లను పరిష్కరించి ప్రజారోగ్యం పట్ల, ఉద్యోగుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఆశిస్తాను అంటూ ఎపిసిసి అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప‌లు డిమాండ్ల‌కు సంబంధించి వెంట‌నే నెర‌వేర్చాల‌ని కోరుతూ ఎపిసిసి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం న్యాయమైన డిమాండ్ల‌ను తీర్చాల‌ని, 21వేల మంది ప్రజారోగ్య వైద్య ఉద్యోగులకు న్యాయం చేయాల‌ని, జి.ఓ.నెం.27 రద్దు చేయాల‌ని, జిఓ నెం 27ను సవరించి, ‘కన్సాలిడేటెడ్ పే’ అనే విధానం రద్దు చేయాల‌ని, ఒకే పనికి ఒకే వేతనం సుప్రీం కోర్టు తీర్పును అమ‌లు చేయాల‌ని, పారా మెడికల్ ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని, ప్రజారోగ్య పనులు కుంటుపడే విధంగా వారిని ఇతర పనులకు, తమరి ప్రచార కార్యక్రమాలకు వినియోగించటం దారుణం. తక్షణం నిలిపివేయాల‌ని, హైకోర్టు తీర్పుననుసరించి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు విధానాన్ని తొలగించి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాల‌ని ర‌ఘువీరా ఆ లేఖ‌లో ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవ‌ల జ‌రిగిన 84వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగుల, కార్మికుల దోపిడీని రద్దు చేస్తామని తీర్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకుళ్లారు. ప్రాధమిక వైద్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు సరిపడే స్థాయిలో మందుల సరఫరా చేయాల‌ని, ఎంతో సమంజసమైన వారి డిమాండ్లను పరిష్కరించి ప్రజారోగ్యం పట్ల, ఉద్యోగుల సంక్షేమం పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఆశిస్తాను అంటూ ఎపిసిసి అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

Just In...