Published On: Sat, Apr 20th, 2019

సీఎం చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

* అమ‌రావ‌తిలో ఘనంగా జన్మదిన వేడుకలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 69వ జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో శ‌నివారం ఘనంగా జరిగాయి. ఉద‌యం త‌న నివాసంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో కేకును క‌త్తిరించి వేడుక‌లు జ‌రుపుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వ‌చ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు చంద్రబాబుకు మంగళాశీర్వచనాలు పలికారు. గుంటూరు రాష్ట్ర తెదేపా కార్యాలయంలో మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెదేపా నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట పట్టణంలోని సీబీఎన్‌ ఆర్మీ, తెదేపా శ్రేణులు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. విజ‌య‌వాడ కేశినేని భ‌వ‌న్‌లో చంద్ర‌బాబు పుట్టినరోజు వేడుక‌ల‌ను పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

Just In...