Published On: Mon, Apr 16th, 2018

సీఎం చంద్ర‌బాబు జ‌న్మ‌దినం రోజున‌… విజ‌య‌వాడ‌లో మెగా ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు

* విజ‌య‌వంతం చేయాల‌ని గరీబ్ గైడ్ స్వచ్చంద సంస్థ పిలుపు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఈ నెల 20 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 68వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రీం కోర్టు న్యాయ‌వాది డాక్టర్ డీవీ రావు ఆలోచన మేరకు విజయవాడలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గరీబ్ గైడ్ స్వచ్చంద సంస్థ నిర్వహకురాలు భార్గవీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర‌క్తదానంలో ప్రపంచవ్యాప్త రికార్డును స్థాపించేందుకు రాష్ట్ర రధ‌సారధి చంద్రబాబు పుట్టిన రోజున అందరికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని మ‌హాత్మాగాంధీరోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ప్రాంగణంలో నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంట‌ల వరకు ర‌క్త‌దాన శిబిరం కొనసాగుతుందని తెలిపారు. రక్తదాన ఉద్యమంలో పనిచేస్తున్న అన్ని స్వచ్చంద సంస్థల సహకారం, ప్రభత్వ యంత్రాంగం ప్రోత్సాహంతో కనీవినీ ఎరుగని రీతిలో రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించి విజయవాడ చరిత్రలో ఒక రికార్డుకు శ్రీకారం చుడతామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో అన్ని వర్గాల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా భార్గవి కోరారు. గ‌తంలో ఢిల్లీలో నిర్వ‌హించిన ర‌క్త‌దాన శిబిరానికి విశేష స్పంద‌న ల‌భించింద‌ని పేర్కొన్నారు.
 

Just In...