Published On: Wed, Jul 10th, 2019

సీఎం జగన్‌కు ముద్రగడ బహిరంగ లేఖ

సెల్ఐటి న్యూస్‌, తూర్పుగోదావరి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం తెదేపా అధినేత చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, ఆయన గెలుపు కోసం కాపు సామాజిక వర్గమంతా పోరాడితే తెదేపా ప్రభుత్వం అరాచక పాలన చేసిందని లేఖలో పేర్కొన్నారు. ‘‘అగ్రవర్ణ పేదలకు అప్పట్లో కేంద్రం పది శాతం రిజర్వేషన్ కల్పించింది. అందులో సగం కాపులకంటూ చంద్రబాబు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకొన్నారు’’ అని ముద్రగడ దుయ్యబట్టారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో బీసీ సర్టిఫికెట్ అడుగుతుంటే అలాంటి అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారని, చంద్రబాబు చేసిన మోసాన్ని గ్రహించిన కాపులు తెదేపా పాలనను అంతం చేయడానికి వైకాపాకు ఓటు వేశారని లేఖలో చెప్పారు. అందువల్ల కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

Just In...