Published On: Tue, Apr 6th, 2021

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ర‌మ‌ణ దీక్షి‌తులు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్రధానార్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా అర్చ‌కులు సీఎం జ‌గ‌న్‌కు శ్రీవారి ప్ర‌సాదాలను అందజేశారు. తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడం ప‌ట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అర్చ‌కులు కృతజ్ఞతలు లిపారు.

Just In...