Published On: Sat, Sep 19th, 2020

సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం…

* వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంపు

తాడేపల్లి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేలు ప్రోత్సాహకాన్ని రూ.5 వేలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Just In...