Published On: Fri, Apr 3rd, 2020

సీఎం స‌హాయ‌నిధికి గంగ‌వ‌రం పోర్టు భారీ విరాళం..

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు తరపున రూ.3 కోట్లు విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌కు అందజేసిన గంగవరం పోర్టు ఛైర్మన్‌ డి.వి.ఎస్‌.రాజు, సీఈఓ, మాజీ డీజీపీ ఎన్‌.సాంబశివరావు. అలాగే గంగవరం పోర్టులో షేర్‌ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్‌ డివిడెండ్ చెక్కును కూడా సీఎం వైయస్ జగన్‌కు వారు అందజేశారు.

Just In...