Published On: Sat, Sep 9th, 2017

సీనియర్ నటుడు, నిర్మాత ఆర్‌.ఎన్‌.సుద‌ర్శ‌న్ మృతి

* సంతాపం తెలిపిన ప్రముఖులు

సెల్ఐటి న్యూస్‌, జ‌న‌ర‌ల్ డెస్క్‌: సీనియ‌ర్ నటుడు, నిర్మాత ఆర్.ఎన్.సుదర్శన్ (78) శ‌నివారం మ‌ధ్యాహ్నం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. గత వారం కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆసుపత్రిలో చేరారు. సుదర్శన్ భార్య శైలశ్రీ నటిగా సుపరిచితం. 21 వయస్సులో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన సుదర్శన్ దాదాపు 60 సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ భాషలలోను పలు సినిమాలు actor_sudarsan_1చేసిన సుద‌ర్శ‌న్ వయస్సు పైబడిన తర్వాత కన్నడ చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ పోషించారు. పలు టీవి షోస్‌లోనూ పార్టిసిపేట్ చేసిన సుదర్శన్ తన సినిమాలలో పాటలు కూడా పాడాడు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఫాదర్‌గా పిలవబడే ఆర్.నాగేంద్రరావు తనయుడిగా ఉన్న సుదర్శన్ నిర్మాతగా కూడా రాణించారు. సుదర్శన్ సోదరుడు ఆర్.ఎన్.జయగోపాల్ పాపులర్ లిరిసిస్ట్‌గా ఉండగా, మరో సోదరుడు ఆర్.ఎన్.కె.ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. జయగోపాల్ 2008లో మరణించగా,  ప్రసాద్ 2012లో తనువు చాలించారు. సుదర్శన్ 2010లో హీరో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్‌’ చిత్రంతో సందర్శన్‌ చివరిసారిగా నటించారు. కమల్ నటించిన నాయగన్ చిత్రంలోను ప్రతినాయక పాత్ర పోషించి అందరి మనసులు గెలుచుకున్నారు సుదర్శన్. ఆయన మృతికి కన్నడ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.

Just In...