Published On: Thu, Aug 8th, 2019

సీపీఐ నేత రామకృష్ణకు రిమాండ్‌

* గుంతకల్లు న్యాయస్థానం ఆదేశం

సెల్ఐటి న్యూస్, గుంతకల్లు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణకు అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కోర్టు వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. 2008 జులై 7న రైతు సమస్యలపై సీపీఐ నాయకులు రైల్ రోకో నిర్వహించారు. అప్పట్లో దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామకృష్ణతో పాటు మరో ఇద్దరు సీపీఐ నాయకులు ఉన్నారు. వీరిలో కాటమయ్య, జాఫర్‌ 2017 అక్టోబర్ నెలలో విచారణకు హాజరు కాగా.. వారికి జరిమానా విధించింది. కానీ అప్పట్లో రామకృష్ణ కోర్టు విచారణకు హాజరు కాలేదు. దీంతో బుధవారం జరిగిన కోర్టు విచారణకు రామకృష్ణ హాజరు కాగా.. తక్షణమే ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, దీనిపై సీపీఐ నేతలు రిమాండ్‌ బెయిల్‌ కోసం ప్రయత్నించగా గుంతకల్లు న్యాయస్థానం తిరస్కరించింది. రామకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను అధికారులు అనంతపురం జైలుకు తరలించారు.

Just In...