Published On: Fri, Jul 12th, 2019

సున్నా వడ్డీ రుణాలపై సభలో వాగ్వాదం..

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండో రోజు శుక్ర‌వారం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై చర్చలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్పందిస్తూ..       ‘‘మేం 150 మంది ఉన్నాం. మేమంతా లేస్తే మీరు మాట్లాడలేరు’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్‌ తమ్మినేని కల్పించుకొని పరిస్థితులను సద్దుమణిగించారు.

Just In...