Published On: Tue, Aug 11th, 2020

సుప్రీం చారిత్రాత్మ‌క‌ తీర్పు…

* ఆడపిల్లలకు స‌మానంగా ఆస్తి హక్కు

న్యూఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కును గురించి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మంగ‌ళ‌వారం చారిత్రాత్మ‌క తీర్పు వెలువరించింది. తండ్రి (లేదా తల్లి) 2005 కంటే ముందే మరణించినా కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని.. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ-వారసత్వపు హక్కు దాఖలు అవుతుందని సుప్రీం 2005 సెప్టెంబర్‌ 9లో సవరణ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సవరణ తేదీ నాటికి కుమార్తె, తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందన్న తాజా తీర్పు ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాజా తీర్పును అనుసరించి సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా, ఆమె సంతానం చట్టపరంగా ఆమెకు రావాల్సిన వాటాను కోరవచ్చు. కుమారుడితో సరిసమానంగా కుమార్తెకూ ఆస్తిలో హక్కును ప్రసాదించిన ఈ తీర్పు.. హిందూ అవిభక్త కుటుంబాల్లో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధాన్ని తొలగించిందని పలువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Just In...