Published On: Sat, Apr 13th, 2019

సూర్యారావుపేట పోలీసులని ఆశ్రయించిన సుమశ్రీ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: తన కూతురు సాయిశ్రీ మృతికి కారణమైన మాదంశెట్టి శివకుమార్ ,ఎమ్మెల్యే బొండా ఉమాపై హైకోర్డు ఆదేశాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసులని సుమశ్రీ ప్ర‌శ్నించింది. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ పోలీసుల తాత్సారాన్ని ప్ర‌శిస్తూ సుమ‌శ్రీ  శ‌నివారం సూర్యారావుపేట పోలీసులని ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు ఈ నెల 15 వరుకు గడువు ఉందని ఈలోపే కేసు నమోదు చేస్తామని ఈ సంద‌ర్భంగా సుమశ్రీకి పోలీసులు హామీ ఇచ్చారు. తన కూతురు సాయిశ్రీ మృతికి బొండా ఉమా అనుచరుడు మాదంశెట్టి శివ ,బొండా ఉమాపై రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేసినట్లు సుమశ్రీ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

Just In...