Published On: Wed, Feb 24th, 2021

సోము వీర్రాజును కలిసిన బిసి విద్యాధికుల జేఏసి నేత‌లు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: భాజపా రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజును ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిట్ర శివన్నారాయణ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ప‌లువురు మంగ‌ళ‌వారం క‌లిసి రాష్ట్రంలో బిసిలకు జరుగుతున్న అన్యాయాన్ని వినతిపత్రం ద్వారా అందచేశారు. ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ భాజపా బిసిలకు ఎప్పుడూ పెద్దపీట వేసిందని దానికి ఉదాహరణ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపంలో అని అన్నారు. 2024 ఎన్నికల్లో బిసిలకు 100 సీట్లు కేటాయించాలని నాయ‌కులు అడగ్గా సోము వీర్రాజు స్పందిస్తూ రాష్ట్రంలో కులాల వారిగా జనాభా, రిజర్వేషన్లు దామాషా ప్రకారం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రమోషన్ల రిజర్వేషన్లులో జరుగుతున్న అన్యాయాన్ని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విషయాన్ని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్యక్రమంలో బిసి విద్యాధికుల జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల అదిశేషు, పెంటి నాగరాజు, కొల్లి జగన్, కోదాటి సత్య ప్రసాద్, తొలుసురి శ్రీనివాస్, ప్రొఫెసర్ శ్రీనివాస్, పట్నాయక్, వాసా పల్లపరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Just In...