Published On: Thu, Aug 15th, 2019

స్థిరంగా శ్రీశైలం వరద ప్రవాహం

* 10 గేట్ల ద్వారా 7.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు

సెల్ఐటి న్యూస్, శ్రీశైలం: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 7.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయానికి 8.92లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 8.60 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.6 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 197.01 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,157 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌కు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. 8,80,203 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 7,23,536 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 302 టీఎంసీలు ఉంది. మరోవైపు పులిచింతలకూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.49 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 16 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 39.69 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులకుగానూ.. ప్రస్తుతం 171 అడుగులు నమోదైంది.

Just In...