Published On: Sat, May 23rd, 2020

స్థిరాస్తుల విక్రయానికి తితిదే ఉత్తర్వులు…

తిరుమల, సెల్ఐటి న్యూస్‌: తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి రెండు బృందాలను తితిదే ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాల్లో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మ‌రోవైపున తితిదే నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మౌతోంది. స్వామివారి ఆస్థులు అమ్మాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని శ్రీవారి భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు.

Just In...