Published On: Tue, Oct 16th, 2018

స్మార్ట్‌ఫోన్ల‌కు స్వీయ‌ర‌క్ష‌ణ ప‌రిక‌రాల ప‌నితీరు అధ్భుతం

*  ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ నాగుల్‌మీరా

* అందుబాటులోకి ఆక్వా ఫ్రీ నానో టెక్నాల‌జీ ప‌రిక‌రాలు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో అంతే విధంగా న‌ష్టాలు కూడా ఉన్నాయ‌ని ముఖ్యంగా ఈ ప్ర‌భావం స్మార్ట్ ఫోన్లుతో పాటు సాధార‌ణ ఫోన్ల‌పైన కూడా ఎక్కువగా ఉంటుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ కె.నాగుల్‌మీరా అన్నారు. మొగ‌ల్రాజ‌పురంలో మంగ‌ళ‌వారం ఓ హోట‌ల్‌లో ఆక్వా ఫ్రీ నానో టెక్నాల‌జీ ఆధ్వ‌ర్యంలో ఫోన్ల స్వీయ‌ర‌క్ష‌ణ అత్యాధునిక ప‌రిక‌రాల‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం నాగుల్‌మీరా ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వేలాది రూపాయ‌లు వెచ్చించి కొనుగోలు చేసుకున్న స్మార్ట్‌ఫోన్లు, దుమ్మూధూళీతో పాటు తేమ చేర‌డం ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో త్వ‌రిత‌గ‌తిన పాడ‌వుతున్న త‌రుణంలో స్మార్ట్ ఫోన్ల‌కు పూర్తిస్థాయి ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ జ‌ర్మ‌న్ టెక్నాల‌జీతో రూపొందించిన ఆక్వా ఫ్రీ ప‌రిక‌రాలు వినియోగం ద్వారా ఫోన్ల‌లో చేరిన దుమ్మూధూళిని తొల‌గించ‌డం, ఫోన్ లోప‌లకు చేరిన తేమ‌ను అరిక‌ట్ట‌డం వంటివి చాలా త‌క్కువ స‌మ‌యంలో శుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు కేవ‌లం అతి త‌క్కువ ఖ‌ర్చుతో న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి రావ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని తెలిపారు.  ఏపీలో తొలిసారిగా న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఇటువంటి ఆక్వా ఫ్రీ నానో టెక్నాల‌జీ ప‌రిక‌రాలు ఏర్పాటు చేయ‌డం ద్వారా ప‌లువురికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సాంకేతిక‌త‌ను వినియోగించ‌డం ద్వారా అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం, ప్ర‌త్యేకంగా రియ‌ల్ టైం గ‌వ‌ర్న‌నెన్స్ ద్వారా రాష్ట్రాభివృద్ధిని ప‌ర్య‌వేక్షిస్తూ టెక్నాల‌జీతో ముందుకు సాగుతున్నార‌ని ఈ క్ర‌మంలో టెక్నాల‌జీని వినియోగిస్తూ స్మార్ట్ ఫోన్ల‌కు స్వీయ‌ర‌క్ష‌ణ క‌ల్పించే అత్యాధునిక ప‌రిక‌రాలు అందుబాటులోకి రావ‌డం ముదావ‌హ‌మ‌న్నారు. ఆక్వా ఫ్రీ నానో టెక్నాల‌జీ సంస్థ ప్రాజెక్టు ఛైర్మ‌న్ విజ‌య‌ర‌త్నం గ‌ణేష్ వ‌ర‌ణ్‌, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ గుమ్మ‌ళ్ల రోహిణిలు మాట్లాడుతూ ఈ నూత‌న టెక్నాల‌జీ ద్వారా స్మార్ట్ ఫోన్ల‌కు పూర్తిస్థాయిలో ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌న్నారు. ఈ టెక్నాల‌జీ వినియోగం ద్వారా నీరు లోప‌ల‌కు చేరినా స్మార్ట్ ఫోన్‌కు ఎటువంటి సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌ని చెప్పారు. దీనిపై సెల్‌ఫోన్ల వ్యాపారుల‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌డంతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగ‌దారుల‌కు నూత‌న టెక్నాల‌జీ ప‌నితీరుపై డెమో ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌లువురు వినియోగదారుల స్మార్ట్‌ఫోన్ల‌ను నూత‌న టెక్నాజీతో శుభ్ర‌ప‌రిచి ప‌రిక‌రాల ప‌నితీరును ప్ర‌ద‌ర్శించారు.
 

Just In...