Published On: Wed, Nov 6th, 2019

స్మార్ట్ కార్డుల బట్వాడాకు కొరియర్ ఏజెన్సీలతో ర‌వాణా శాఖ సంప్ర‌దింపులు

* డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: రవాణాశాఖ జారీ చేసిన వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి స్మార్ట్ కార్డులను ఇప్ప‌టివ‌ర‌కూ తపాలశాఖ నుండి వాహన యజమానులకు పంపించడం జరిగింద‌ని అయితే ఈ విధానంలో జాప్యం జ‌రుగుతున్న నేప‌ధ్యంలో వాహనదారులకు నేరుగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే స్మార్ట్ కార్డులను అందించే ప్రక్రియను తాత్కాలికంగా చేపట్టామని డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. మ‌హాత్మాగాంధీ రోడ్డులోని డీటీసీ కార్యాలయం నుండి ఈ మేర‌కు బుధవారం ఒక ప్రకటన విడుద‌ల చేశారు. డిటిసి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల స్మార్ట్ కార్డులను తపాల శాఖ నుండి బట్వాడా చేయడం జరిగేదని, రవాణాశాఖ నుండి తపాలశాఖకు కేటాయించే బడ్జెట్‌లో ఆలస్యం అయిన క్ర‌మంలో స్మార్ట్ కార్డులను తీసుకోవడం నిలుపుదల చేయ‌డంతో వస్తున్నఇబ్బందులను అధిగమించే దానిలో భాగంగా ప‌లు కొరియర్ కంపెనీలతో సంప్రదించడం జరిగిందని డీటీసీ తెలిపారు. బట్వాడ చేసేదానిలో ధరలు వివరాలను సిటీ, రూరల్ ప్రాంతాలకు ఎంత సమయంలో బట్వాడా చేయ‌డం జరుగుతుంది వంటి వివరాలను ఈ సంద‌ర్భంగా డిటిసి ఆయా కంపెనీ ప్ర‌తినిధుల‌ను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వీటిపై నివేదికను తయారుచేసి రవాణాశాఖ కమిషనర్‌కు పంపనునట్లు డిటీసీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 స్మార్ట్ కార్డులను రోజువారి బట్వాడా చేయ‌డం జరిగేదని ఆయన వెల్ల‌డించారు.

Just In...